జబర్దస్త్ తో అనసూయ భరద్వాజ యాంకర్ గానే కాకుండా రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో అందుకుంటూ వచ్చారు. ఒకరోజు ఎపిసోడ్ కు దాదాపు లక్షన్నరకు పైగా రెమ్యూనరేషన్ కూడా అందుకుంటూ వచ్చింది. అయితే ఇటీవల అనసూయ జబర్దస్త్ షో నుంచి తప్పకున్నట్లు తెలియడంతో అందరూ షాక్ అయ్యారు. దీని వెనుక కొన్ని వివాదాలు కారణమని కూడా టాక్ వచ్చింది. అయితే అందుకు ప్రధాన కారణం ఒక దర్శకుడు అని తెలుస్తోంది.
అతను మరెవరో కాదు హరిహర వీరమల్లు దర్శకుడు క్రిష్ అని సమాచారం. ఎందుకంటే క్రిష్ రచించిన ఒక కథలో త్వరలోనే అనసూయ వేశ్య పత్రలో కనిపించబోతోంది. క్రిష్ సోనీ LIV కోసం కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్ ను కథను అందించి నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాడు. గురజాడ అప్పారావు యొక్క నవల ఆధారంగా రూపొందించబడనున్న ఆ సిరీస్‌లో అనసూయ వేశ్య మధురవాణి పాత్రలో నటిస్తుందట. ఆ ప్రాజెక్ట్ కోసం చాలా రోజులు వర్క్ చేయాల్సి ఉంటుందని అందుకే ఆమె జబర్దస్త్ షో నుంచి బయటకు రావాల్సి వుంటుందని దర్శకుడు సలహా ఇవ్వడంతో అనసూయ తప్పుకున్నట్లు సమాచారం. Follow
0 Comments