మెగాస్టార్ ఓటీటీ డీల్.. నెగిటివ్ రోల్?


మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఎక్కువగా కమర్షియల్ సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆయనను కొన్ని ప్రముఖ ఓటిటి కంపెనీలు కూడా ప్రత్యేకంగా కలిసి వెబ్ సిరీస్ చేసేందుకు చర్చలు జరుపినట్లు సమాచారం. కంటెంట్ హెడ్స్ అందరూ కూడా మెగాస్టార్ చిరంజీవి వెబ్ సిరీస్ లో కూడా నటిస్తే బాగుంటుంది అని కోరారుట.

అయితే కొన్ని కాన్సెప్ట్స్ చెప్పినప్పటికీ మెగాస్టార్ వాటిపై పెద్దగా ఆసక్తి చూపలేదు అని తెలుస్తోంది. కంటెంట్ అద్భుతంగా ఉండాలి అని కమర్షియల్ అంశాల గురించి పెద్దగా పట్టించుకోవద్దు అని ఎందుకంటే ఓటీటీ లో ఇటీవల కాలంలో అలాంటి వాటికి ఎక్కువగా ఆదరణ లభిస్తుంది అని అన్నారట. ఈ తరుణంలో నెగిటివ్ రోల్స్ వచ్చినా కూడా చేయడానికి తను సిద్ధమే కాకపోతే కంటెంట్ మాత్రం చాలా పవర్ఫుల్గా ఉండాలి అని విభిన్నంగా ఉండాలి అని చిరంజీవి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆహా వారు అయితే ఒక మెగా వెబ్ సీరీస్ పై ప్రణాళికలు జరుపుతున్నట్లు టాక్.

Post a Comment

Previous Post Next Post