త్రివిక్రమ్ పై పవన్ డైరెక్టర్ ఆగ్రహం?


పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలి అంటే మొదట త్రివిక్రమ్ శ్రీనివాసుస్ ను కలిస్తే సరిపోతుంది అని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే ఉంది. చాలా వరకు పవన్ కళ్యాణ్ కద వినడం కంటే ముందే త్రివిక్రమ్ తో దర్శకులకు ఒకసారి సంధి కలుపుతాడు. త్రివిక్రమ్ విని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో మాట్లాడి సినిమా చేయాలా వద్దా అని విషయం గురించి చర్చిస్తారు.

పవన్ కళ్యాణ్ ఇంతవరకు వకీల్ సాబ్ సినిమాతో పాటు హరిహర వీరల్లు అలాగే భీమ్లా నాయక్ అన్ని కథలు కూడా త్రివిక్రమ్ ద్వారానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడు రాబోయే సినిమాలు కూడా అదే తరహాలో సెట్స్ పైకి రానున్నాయి. అయితే ఈ క్రమంలో హరిహర వీరమల్లు సినిమా కంటే ముందే పవన్ కళ్యాణ్ తో మరొక రీమేక్ సినిమాను సెట్స్ పైకి తీసుకువస్తూ ఉండడంతో సినిమాకు కాస్త సమస్యలు ఎదురవుతున్నాయి. 

దీంతో దర్శకుడు క్రిష్ అయితే త్రివిక్రమ్ తో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ముందు హరిహర వీరమల్లు ఫినిష్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పారట. కానీ పవన్ కళ్యాణ్ కమిట్మెంట్స్ ప్రకారం షూటింగ్ తొందరగా అయిపోతుంది అని అందుకే వినోదాయ సీతమ్ రీమేక్ చేసేందుకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా కూడా త్రివిక్రమ్ నిర్ణయాలకు క్రిష్ తీవ్ర అసంతృప్తితోనే ఉన్నట్లుగా తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post