రామారావు ఆన్ డ్యూటీలో పవిత్ర, నరేష్.. థియేటర్స్ లో విజిల్స్!


సీనియర్ నటిమని పవిత్ర లోకేష్ ఇటీవల సీనియర్ నటుడు నరేష్ వివాదంతో ఎక్కువగా వార్తలలో నిలిచిన విషయం తెలిసిందే. కాంట్రవర్సీ విషయాలలో పెద్దగా కలుగజేసుకొని ఆమెపై మొదటి సారి నరేష్ తో ప్రేమలో ఉన్నట్లు అలాగే అతనిని పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు కొందరు ఆరోపణలు చేశారు. ఇక ఆ వివాదం తర్వాత ఆమెకు పాజిటివ్ క్యారెక్టర్లు కూడా చాలా వరకు తగ్గినట్లుగా తెలుస్తోంది.

ముఖ్యంగా ఒకప్పుడు పవిత్ర లోకేష్ చాలామంది అగ్ర హీరోలకు తల్లిగా కూడా నటించారు. అయితే ఇప్పుడు నరేష్ వివాదం అనంతరం ఆమెకు తల్లి పాత్రలు రావడం లేదని తెలుస్తోంది. ఇక చివరిగా రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటించింది. నేడు ఆ సినిమాగా రిలీజ్ కాగా  ఎలాంటి పాత్రలో నటించింది అనే విషయం ప్రేక్షకుల్లో కొంత ఆసక్తిని కలిగించింది. అందరూ ఊహించినట్లే ఈ సినిమాలో కూడా పవిత్ర, రవితేజకు తల్లిగా నటించింది. ఆ క్యారెక్టర్ అయితే సినిమాలో పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక నరేష్ అయితే హీరోయిన్ ఫాదర్ గా కనిపించడం మరో ట్విస్ట్. ఇక వారి పాత్రలు రాగానే థియేటర్స్ లో గోల గోలగా విజిల్స్ వేసిన వాతావరణం కనిపించింది.

ఇక రెండు పాత్రలు ఎప్పటిలానే చాలా రొటీన్ గానే కనిపించాయి. అయితే నరేష్ వివాదం తర్వాత ముందుగా వచ్చిన కొన్ని ఆఫర్లు కూడా క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది. ఆమెను తల్లి పాత్రలో తీసుకోవడానికి ఓ వర్గం హీరోలు వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. ఒక ఇద్దరు హీరోలు కూడా ఆమెతో రెండు రోజుల షూటింగ్ అనంతరం ఆ షూటింగ్ క్యాన్సల్ చేసుకుని మళ్లీ మరొకరితో రీ షూట్ చేసినట్లుగా కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. మరి రాబోయే రోజుల్లో పవిత్ర లోకేష్ మళ్లీ ఇదే తరహాలో తల్లి పాత్రలలో కనిపిస్తుందో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post