అల్లు అర్జున్ రేంజ్ అంటే ఇదిరా!


ఐకాన్ స్టార్ గా ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఏకంగా అతన్ని ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే అగ్ర హీరోల్లో ఒకరిగా పేర్కొంటున్నారు. కేవలం సౌత్ లోనే కాకుండా బన్నీ పుష్ప సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే.

ఇక అతని క్రేజ్ ఎంతవరకు పెరిగిపోయిందో ఇటీవల మరొక ఫోటోతో క్లారిటీగా అర్థమైపోయింది. ప్రముఖ నేషనల్ మీడియా ఇండియా టుడే మ్యాగజైన్ పై బన్నీ పుష్ప స్వాగ్ తో కనిపించాడు. సౌత్ సినిమా డామినేషన్ ఇన్ ఇండియా అంటూ పేర్కొన్న ఆర్టికల్ లో అల్లుఅర్జున్ ని ప్రముఖంగా చూపిస్తూ కవర్ పేజ్ లో పిక్ వేశారు,  కేవలం ఒకే ఒక్క పుష్ప దెబ్బతో అతని క్రేజ్ ఏ స్థాయికి వెళ్లిపోయిందో ఈ ఫోటోతో అర్థం చేసుకోవచ్చు. అలాగే అల్లు అర్జుజ్ రేంజ్ అంటే ఇదిరా అంటూ ఫ్యాన్స్ కూడా నాటుగా రియాక్ట్ అవుతున్నారు. ఇక పుష్ప సెకండ్ పార్ట్ తో బన్నీ ఇంకా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి.

Post a Comment

Previous Post Next Post