వారసుడితో దిల్ రాజు.. బాక్సాఫీస్ స్మైల్!


తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఎలాంటి సినిమా చేసిన కూడా మినిమం సక్సెస్ అయ్యే విధంగానే విడుదల చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడూ తన ఫ్యామిలీలో మధురమైన ఆనంద క్షణాలను అనుభవిస్తున్నారు. ఇటీవల దిల్ రాజుకు వారసుడు పుట్టిన విషయం తెలిసిందే. అతనికి సంబంధించిన మొదటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది

దిల్ రాజు తన కొడుకుని ఎత్తుకొని బాక్సాఫీస్ సక్సెస్ వచ్చినంత ఆనందంగా కనిపిస్తూ ఉన్నాడు. దిల్ రాజు మొదటి భార్య మరణించడంతో ఆ తర్వాత అతను తేజస్వి అనే మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు దిల్ రాజు 5 పదుల వయసులో తన కుమారుడికి జన్మనిచ్చాడు. ఒకవైపు సినిమాలో చూసుకుంటూనే మరొకవైపు చాలా తొందరగానే ఇంటికి వచ్చేసి ఫ్యామిలీ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి థాంక్యూ సినిమా విడుదల కానుంది.


Post a Comment

Previous Post Next Post