మారుతి.. అంత పెద్ద హీరోలతో ఏం చేస్తాడో?


ఈరోజుల్లో సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మారుతి అనంతరం చాలా వరకు తక్కువ బడ్జెట్ లోనే ఎక్కువ ప్రాఫిట్స్ అందించే సినిమాలను తీశాడు. ముఖ్యంగా డిజాస్టర్స్ లో ఉన్న హీరోలకు కూడా అతను మంచి బూస్ట్ ఇచ్చే విధంగా సినిమాలను తెరకెక్కించాడు. నాని బలే బలే మగాడివోయ్, శర్వానంద్ మహానుభావుడు, సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజు పండగే.. ఇలా మీడియం రేంజ్ హీరోలకు ఫ్లాప్ లో ఉన్నప్పుడే సక్సెస్ ఇచ్చాడు.

కానీ గోపీచంద్ కు మాత్రం పక్క కమర్షియల్ సినిమాతో అతను సక్సెస్ ఇవ్వలేకపోయాడు. ఈ సినిమా రిజల్ట్ పై మొదటి రోజే క్లారిటీ వచ్చేసింది. ఇక ఇప్పుడు మాత్రం మారుతి ఏకంగా ప్రభాస్, చిరంజీవి, అల్లు అర్జున్ పేర్లను చెప్పేస్తున్నాడు. వాళ్లతో సినిమా ఉంటుంది అని ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చాడు. కానీ పక్క కమర్షియల్ తో అతను రొటీన్ ఫార్ములా వర్కౌట్ కాలేదు అని అర్థమైంది. అంతకు ముందు వచ్చిన మంచి రోజులొచ్చాయి కూడా డిజాస్టర్ అయ్యింది. కరోనా తర్వాత జనాల మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది అని చెప్పవచ్చు. మరి ఈ తరుణంలో అగ్ర హీరోలు మారుతితో సినిమాలు చేస్తారా లేక రిస్క్ అని పక్కన పెట్టేస్తారా అనేది చూడాలి.


Post a Comment

Previous Post Next Post