థాంక్యూ డిజాస్టర్ కాదు.. అంతకుమించి!


నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా ఓవర్గం ప్రేక్షకుల నుంచి డీసెంట్ టాక్ అందుకున్నప్పటికీ కూడా పరిస్థితులు ఈ సినిమాకి చాలా విరుద్ధంగా మారిపోయాయి. ఒకవైపు వర్షాలు ఉండడం అలాగే విక్రమ్ కె కుమార్ నాగచైతన్య కాంబినేషన్ ఏదో లైఫ్ జర్నీ సినిమాను చూపించడం అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకోలేకపోయింది. 

ఈ సినిమాకు అత్యధిక స్థాయిలో నెగిటివ్ రివ్యూలు కూడా దెబ్బకొట్టాయి  ఏదేమైనా కూడా నాగచైతన్య తన కెరీర్ లోనే దారుణమైన సినిమా కంటే దారుణమైన కలెక్షన్స్ అందుకున్నాడు. నాగచైతన్య థాంక్యూ సినిమా మొదటి రోజు కేవలం 2.50 కోట్ల వసూళ్లను మాత్రమే అందుకుంది. ఇంతకుముందు చైతు ఏ సినిమా కూడా ఇంత తక్కువ స్థాయిలో కలెక్షన్స్ అందుకోలేదు.

నాగచైతన్య ఇప్పటివరకు అత్యధిక దారుణమైన సినిమాల్లో యుద్ధం శరణం ఒకటి. కానీ ఆ సినిమా కూడా ఇంతకంటే ఎక్కువ స్థాయిలో మొదటి రోజు ఓపెనింగ్స్ అందుకుంది. ఒక విధంగా నాగ చైతన్య సోలోగా సొంత టాలెంట్ తో అయితే ఇంతవరకు మంచి సక్సెస్ అందుకున్నది చాలా తక్కువ. 

అతనికి ఏదో ఒక విధంగా ఇతరుల నుంచి వచ్చే బజ్ ఉంటేనే సక్సెస్ అనేది లభిస్తుంది. ఇంతకుముందు బంగారు రాజు సినిమా మల్టీ స్టారర్ సీక్వెల్ కావడం.. అలాగే లవ్ స్టోరీ సినిమా శేఖర్ కమ్ముల సాయి పల్లవి కాంబినేషన్ కావడం అంతకు ముందు వచ్చిన మజిలీలో సమంత ఉండడం. ఇలా చైతన్య కెరీర్ లో పెద్ద హిట్స్ అన్ని కూడా కాంబినేషన్ సెట్ అయితేనే వస్తున్నాయి. కానీ సోలోగా మాత్రం చైతన్య కంటెంట్ ఉన్న కథలతో రావడం లేదు.

Post a Comment

Previous Post Next Post