ప్రముఖ నిర్మాత దిల్ రాజు రామ్ చరణ్ - శంకర్ సినిమాతో మొత్తం 50 సినిమాలు నిర్మించిన నిర్మాతగా రికార్డును అందుకోబోతున్నాడు. సక్సెస్ ఫెయిల్యూర్స్ సంబంధం లేకుండా వెళుతున్న దిల్ రాజు ఇటీవల తన సినిమాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. అయితే ఒక సినిమా కోసం మొదట పవన్ ను అనుకోని ఆ తరువాత మహేష్ బాబును ఫిక్స్ చేశారట.
కొత్త బంగారులోకం సినిమా అనంతరం డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో అందులో ఇద్దరు హీరోలు అవసరం అని మొదట పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అని అలాగే వెంకటేష్ ను కూడా ఫిక్స్ చేయాలని అనుకున్నారట. ఇక ఆ తరువాత మళ్ళీ మహేష్ బాబు దూకుడు సినిమా చేస్తుండగా సరదగా స్టోరీ లైన్ గురించి చెప్పగా మహేష్ చేస్తానని అన్నాడు. అదే సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు. ఆ విధంగా ఆ కాంబో సెట్ అయ్యిందని దిల్ రాజు అన్నారు.
Follow
Post a Comment