హాలీవుడ్ లో రాజమౌళి మొదటి విజయం


SS రాజమౌళి తెరపైకి తీసుకు వచ్చిన RRR, Overseas లో కూడా హాట్ టాపిక్ గా మారింది.  నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ఏ స్థాయిలో హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేసు.  హాలీవుడ్ విమర్శకులు అలాగే స్క్రీన్ రైటర్‌ లు దర్శకులు ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో ప్రశంసించడం చూస్తునే ఉన్నాము. ఇక ఇప్పుడు ఏకంగా RRR హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ మిడ్ సీజన్ అవార్డ్స్ ఉత్తమ చిత్రం విభాగంలో కూడా నామినేట్ చేయబడింది. 


ది బ్యాట్‌మాన్ మరియు టాప్ గన్: మావెరిక్ వంటి హాలీవుడ్ బిగ్గీలతో పాటు RRR కూడా పోటీలో ఉండడం విశేషం. ఇక ప్రకటించిన అవార్డులలో RRR రన్నరప్‌గా ప్రకటించబడింది.  ఈ విషయాన్ని ప్రకటిస్తూ, HCA యొక్క అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ పోస్ట్ చేసింది.  ఉత్తమ చిత్రంగా HCA మిడ్ సీజన్ అవార్డును... ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్ అనే సినిమా గెలుచుకోగా.. మన RRR సినిమా రన్నరప్ గా నిలిచింది. హాలీవుడ్ అగ్ర సినిమాలను దాటి ఫైనల్ పోటీలో నిలిచింది అంటే గ్రేట్ అనే చెప్పాలి.


Post a Comment

Previous Post Next Post