పక్కా కమర్షియల్.. నష్టాలు వచ్చినా సేఫ్ అయ్యారు!


గోపిచంద్ - మారుతి కలయికలో వచ్చిన యాక్షన్ కామేడి ఎంటర్టైనర్ పక్కా కమర్షియల్ సినిమా మొత్తానికి థియేట్రికల్ గా భారీ నష్టాలను మిగిల్చేలా ఉంది. సోమవారం నాటికి సినిమా కలెక్షన్లు ఒక్కసారిగా 70% డౌన్ అయ్యాయి. చిత్రయూనిట్ బాక్సాఫీస్ హిట్ అంటోంది గాని ఎక్కడ కూడా థియేటర్లలో సందడి మాత్రం కనిపించడం లేదు.

ఇక పక్కా కమర్షియల్ సినిమా బాక్సాఫీస్ వద్ద కనీసం 6కోట్ల షేర్ అయినా రాబట్టిందా లేదా అనేది సందేహంగానే ఉంది. ఇక మొత్తంగా 15 కోట్ల వరకు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక సినిమా నష్టాలు వచ్చినా కూడా నిర్మాత బన్నీ వాసు మాత్రం సేఫ్ అని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ కు అలాగే ఆహా కు కలిపి అమ్మడం ద్వారా 20 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే డబ్బింగ్ శాటిలైట్ హక్కుల్లో కూడా మరింత ప్రాఫిట్ వచ్చినట్లు సమాచారం.


Post a Comment

Previous Post Next Post