కళ్యాణ్ రామ్ ఆస్తులు తాకట్టు.. బింబిసార బడ్జెట్ రిస్క్?


కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా ట్రైలర్ నేడు విడుదల అయింది. ట్రైలర్ కు మంచి స్పందన లభించడంతో సినిమాపై కూడా మంచి హైప్ అయితే క్రియేట్ అయింది. ఆగస్టు 5వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.  సినిమా మేకింగ్ చూస్తూ ఉంటే సీనియర్ డైరెక్టర్ తీసాడా అని అనుకుంటున్నారు. కానీ ఈ సినిమా డైరెక్ట్ చేసింది కొత్త దర్శకుడు వశిష్ట్.

అయితే ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ సొంతంగానే దాదాపు 40 కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా టాక్ అయితే వినిపించింది. ఇక ఇప్పుడు ట్రైలర్ చూస్తూ ఉంటే అది నిజమే అని అనిపిస్తుంది. కళ్యాణ్ రామ్ ఏ సినిమా చేసిన కూడా ఇంతవరకు కనీసం 20 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా అందుకోలేదు. ఇక మొదటిసారి అతను 40 కోట్లతో రిస్క్ చేస్తున్నాడు అంటే సాధారణమైన విషయం కాదు. కళ్యాణ్ రామ్ సినిమా కోసం కొంతవరకు తన ఆస్తులను కూడా తాకట్టు పెట్టి నిర్మించినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అతనికి ఎంతవరకు లాభాలను అందిస్తుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post