ప్రభాస్, మహేష్.. ఏంటి ఈ దుస్థితి?


అగ్ర హీరోలతో సినిమాలు చేసే యువ దర్శకుల పరిస్థితి కొన్నిసార్లు దారుణంగా మారుతోంది. చిన్న సినిమాతో సక్సెస్ కొట్టి వెంటనే అగ్ర హీరోలతో ఛాన్స్ కొట్టేస్తే తప్పకుండా అగ్ర దర్శకుల లిస్ట్ లో చేరిపోవచ్చని కొంతమంది యువ దర్శకులు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. కానీ అనుభవం లేకపోవడం, స్టార్ హీరోను బ్యాలెన్స్ చేయడంలో ప్లాన్ రివర్స్ అవ్వడం వారికి శాపంగా మారుతోంది. 

ప్రభాస్ తో సినిమాలు చేసిన సాహో సుజిత్, రాధే శ్యామ్ రాధాకృష్ణ పరిస్థితి ఇప్పుడు అలానే మారింది. ఈ దర్శకులు ఇంతకుముందు చేసింది కేవలం ఒక్క సినిమా మాత్రమే. ఇక యూవీ క్రియేషన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ వలన ప్రభాస్ డేట్స్ తీసుకొని వారి మీద పెట్టి పెద్ద రిస్క్ చేసి డిజాస్టర్స్ అందుకున్నారు. ఇక రీసెంట్ గా బ్రోచేవారేవారురా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కూడా నానిని 'అంటే సుందరనికి' సినిమాతో బ్యాలెన్స్ చేయలేకపోయాడు. పరశురామ్ సైతం సర్కారు వారి పాటతో మహేష్ బాబుకు మంచి హీట్ ఇవ్వలేకపోయాడు. దీంతో వీళ్ళకు ఇప్పుడు నెక్స్ట్ హీరో దొరకడం కష్టంగా మారింది
.

Post a Comment

Previous Post Next Post