ఆచార్య దెబ్బ.. అటు వైపు తలదూర్చబోనీ కొరటాల?


వరుసగా నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో కొరటాల శివ కూడా మరో రాజమౌళి స్థాయిలో ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఆచార్య దెబ్బకు ఆయన ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. ఇప్పటివరకు ఆయన మీద నమ్మకంతో కొనసాగిన డిస్ట్రిబ్యూటర్స్ ఆ ఒక్క సినిమాతోనే ఊహించని స్థాయిలో నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

అసలు పెట్టిన పెట్టుబడికి 20 శాతం కూడా రికవరీ కాకపోవడంతో డిస్ట్రిబ్యూటర్స్ నెత్తిమీద చేతులు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే ఆచార్య సినిమా డిస్ట్రిబ్యూటర్స్ లో సగం మంది కొరటాల శివకు తెలిసిన వారే. అతను చెబితేనే సినిమా మీద నమ్మకంతో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టి బిజినెస్ లోకి దిగారు. కానీ సినిమా దెబ్బ కొట్టడంతో తదుపరి సినిమా విషయంలో మాత్రం కొరటాల అలాంటి తలనొప్పులు పెట్టుకోకూడదు అని ఫిక్స్ అయ్యాడట. ఎన్టీఆర్ 30వ సినిమా విషయంలో మాత్రం అటువైపు వెళ్ళకుండా తన రెమ్యూనికేషన్ తీసుకొని సైడ్ అయిపోవాలి అని ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. మరి ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post