జూనియర్ ఎన్టీఆర్ RRR సక్సెస్ అనంతరం మరోసారి పాన్ ఇండియా మార్కెట్ లో బలమైన సక్సెస్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. కానీ ఎంత ప్లాన్ చేసినా కొరటాల శివ మాత్రం అనుకున్నట్లుగా ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ను త్వరగా ముందుకు సాగేలా ప్లాన్ చేయడం లేదు. ముఖ్యంగా హీరోయిన్ విషయంలో ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు.
మొదట అలియా భట్ అన్నారు. కానీ ఆమె ఫ్యామిలీ రీజన్స్ వల్ల తప్పుకుంది. ఆ తరువాత కీయరా అద్వానీ, శ్రద్దా కపూర్ అని కొన్ని పేర్లు వినిపించాయి. కానీ ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. అసలు జూన్ చివరలోనే సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు కానీ స్క్రిప్ట్ ప్లానింగ్ ఏది కూడా ఇంకా ఫైనల్ అవ్వలేదని తెలుస్తోంది. ఇక ఆచార్య దెబ్బ పడడంతో కొరటాలపై మరింత ఒత్తిడి పెరిగింది. ఎన్టీఆర్ కూడా చిన్న విషయంలో సైతం కాంప్రమైజ్ అవ్వడం లేదు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు పెడతారో చూడాలి.
Follow
Post a Comment