బింబిసార.. అఖండ, RRR లతో ఒక్క హిట్ పోలిక!


కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా సినిమా ఆగస్టు 5వ తేదీన భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ అయితే చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఎలాగైనా సక్సెస్ అందుకొని తన మార్కెటు కూడా పెంచుకోవాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా ఒక విషయంలో అఖండ, RRR సెంటిమెంటును ఫాలో అవుతోంది. ఈ సెంటిమెంట్ ప్రకారం సినిమా సక్సెస్ అయినట్లే అని భావిస్తున్నారు.

అదేమిటంటే అఖండ సినిమాలో నందమూరి బాలకృష్ణ ఒక చిన్న పాప కోసం యుద్ధం చేస్తాడు అలాగే RRR సినిమాలో కూడా ఓ పసిపాప కోసం బ్రిటిష్ వారిని ఎదిరించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బింబిసార సినిమాలో కూడా ఒక చిన్న పసిపాప కోసమే బింబిసార పూర్తిగా మారిపోయి దుష్టులపై యుద్ధం చేయడానికి నిర్ణయం తీసుకుంటాడు. ఇదే సెంటిమెంట్ గనుక సక్సెస్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిసినట్టే. ఇక ప్రస్తుత వాతావరణంలో జనాలు ఎంతవరకు థియేటర్లకు వెళతారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post