పుష్ప 2 ఓటీటీ హక్కులు.. RRR తరహాలోనే..?


అల్లు అర్జున్ సుకుమార్ కలయికలో తెరపైకి వచ్చిన పుష్ప మొదటి భాగం ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక పుష్ప 2 విడుదల కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సెకండ్ పార్ట్ పై అంచనాలు మరింత పెరగడంతో బిజినెస్ వాల్యూ కూడా గట్టిగానే పెరుగుతుంది. ఇక నిర్మాతలు ఫస్ట్ పార్ట్ విషయంలో జరిగిన పొరపాట్లు ఇప్పుడు జరగకుండా డిమాండ్ ను బట్టి క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నారు.

RRR తరహాలోనే పుష్ప 2 ఓటీపీ హక్కులు అమ్ముడుపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. RRR ఆర్ సినిమా సౌత్ ఇండియన్ ఓటీటీ లాంగ్వేజెస్ హక్కులు జీ 5 అందుకోగా హిందీ స్ట్రీమింగ్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. హిందీ వెర్షన్ కు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలోనే క్రేజ్ దక్కింది. ఇక ఇటీవల నెట్ ఫ్లిక్స్ పుష్ప సెకండ్ పార్ట్ హక్కులను సొంతం చేసుకోవడానికి చర్చలు జరుపుతున్నట్లు టాక్. కేవలం హిందీ లాంగ్వేజెస్ కోసమే ఆ సంస్థ ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం రేపు మాపో డీల్ సెట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post