దిల్ మాఫియా.. నిఖిల్ సినిమాకు ఎన్ని కష్టాలో?


సినిమా ప్రపంచంలో టాలెంట్ ఉంటే ఎవరైనా సక్సెస్ అవుతారు అనేది నిజమే కావచ్చు కానీ కొన్నిసార్లు బ్యాక్ గ్రౌండ్ లేకపోతే సినిమాలకు ఎంత డామేజ్ అవుతుందో ఇటీవల నిఖిల్ పరిస్థితిని చూస్తే ఎవరికైనా సరే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సోలోగానే ఎంతో చిన్న స్థాయి నుంచి నటుడుగా ఎదిగిన నిఖిల్ కార్తికేయ 2 సినిమా గత జూన్ నెల నుంచి విడుదల తేదీని వాయిదా వేసుకుంటూ వస్తోంది.

జూలై 22వ తేదీన విడుదల చేద్దాం అంటే అప్పుడు నాగచైతన్య థాంక్యూ సినిమా వచ్చింది. ఆ తర్వాత ఆగస్టు 5వ తేదీన విడుదల చేద్దాం అంటే అప్పుడు కళ్యాణ్ రామ్ బింబిసారా విడుదలవుతోంది. ఇక ఆగస్టు 12వ తేదీన కూడా విడుదల చేద్దామని అనుకుంటే అప్పుడు కూడా నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా విడుదలవుతూ ఉండడంతో కార్తికేయ 2 సినిమాకు కాస్త ఇబ్బంది ఎదురయింది.  

ఆగస్టు 12వ తేదీ కూడా అవసరం లేదు అని అక్టోబర్లో విడుదల చేసుకోమని చెప్పినట్లుగా కొంతమంది అన్నారు అని నిఖిల్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. కంటిన్యూగా సినిమా వెనక్కి తోసేయలని చూసినప్పుడు చాలా ఎమోషనల్ అయినట్టు ఏడ్చినట్లు కూడా నిఖిల్ తెలియజేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ సినిమాకు మాత్రం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుంది అని ధీమాగా ఉన్నాడు.

Post a Comment

Previous Post Next Post