గీతా ఆర్ట్స్ తో కార్తికేయ డైరెక్టర్.. మెగా ఆఫర్!


కార్తికేయ 2 సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న చందు మొండేటికి ఇప్పుడు డిమాండ్ గట్టిగానే పెరిగింది. ఇక అతనికి ఒక మెగా ఆఫర్ కూడా దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ అతనికి ఒక బంపరాఫర్ ఇచ్చినట్లు సమాచారం. నిర్మాత అల్లు అరవింద్ అతనికి అడ్వాన్స్ చెక్ ఇవ్వడానికి కూడా రెడీ అయినట్లు టాక్.

ఇక గీత ఆర్ట్స్ లో చందు తీయబోయే సినిమాలో హీరో ఎవరు అనే విషయంలో కూడా ఒక క్లారిటీతో ఉన్నారట. మెగా హీరో వరుణ్ తేజ్ తో ఇదివరకే చందు కొన్ని కథలపై చర్చలు జరిపారు. ఇక ఫైనల్ గా అల్లు అరవింద్ ఈ కాంబినేషన్లో ఒక పవర్ఫుల్ మూవీని తీసేందుకు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కార్తికేయ 2 సక్సెస్ లో ఉన్న చందు మొండేటి నార్త్ నుంచి కూడా మంచి సపోర్ట్ అందుకుంటున్నాడు. మరి నెక్స్ట్ అతను పాన్ ఇండియా రేంజ్ లోనే సినిమా తీస్తాడా లేక తెలుగులోనే చేస్తాడా అనేది చూడాలి.

Post a Comment

Previous Post Next Post