బుల్లితెర షోలో మహేష్ బాబు


సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన తదుపరి భారీ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే  సెప్టెంబర్ రెండో వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది. అయితే జీ తెలుగులో ఇటీవలే ప్రారంభమైన డ్యాన్స్ రియాలిటీ షో డాన్స్ ఇండియా డ్యాన్స్ యొక్క రాబోయే ఎపిసోడ్‌లో మహేష్ బాబు అతని ముద్దుల కూతురు సితార ఘట్టమనేని కనిపించనున్నారట.

ఇప్పటికే వీరిద్దరి ఎపిసోడ్ షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. డాన్స్ ఇండియా డ్యాన్స్ తెలుగును అకుల్ బాలాజీ హోస్ట్ చేస్తున్నారు. ఇక ఈ షోకు ప్రముఖ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, నటీమణులు సంగీత, ఆనందిని న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.  ఇక మహేష్ అలాగే సీతారా స్పెషల్ ఎట్రాక్షన్ గా ఈ షోలో సందడి చేయనున్నట్లు టాక్. ఇక త్రివిక్రమ్ సినిమా అనంతరం మహేష్ రాజమౌళి దర్శకత్వంలో మొదటి పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు.

Post a Comment

Previous Post Next Post