లైగర్ దెబ్బ.. ఛార్మి పరిస్థితేంటి?


లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఇప్పుడు నిర్మాత ఛార్మి పరిస్థితి ఏమిటి అనేది హాట్ టాపిక్ గా మారింది. పూరి జగన్నాథ్ తో కలిసిన తరువాత తన ఇన్నేళ్ల సంపాదన మొత్తం కూడా అతని సినిమాలకే పెడుతోంది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ప్రాఫిట్ లోకి వచ్చిన ఛార్మి లైగర్ సినిమా కోసం ఉన్నదంతా ఊడ్చి పెట్టింది. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. 

సినిమా కోసం దాదాపు 100కోట్ల వరకు ఖర్చు చేసినట్లు టాక్ అయితే వస్తోంది. ఇక నాన్ థియేట్రికల్ గా 50 నుంచి 60 కోట్ల మధ్యలో వచ్చినట్లు తెలుస్తోంది. ఇక బాక్సాఫీస్ వద్ద 30 కోట్లు వచ్చినా మరో 20 కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉంది. ఎలా చూసుకున్నా కూడా లైగర్ దెబ్బకు ఛార్మి ఇన్నాళ్లు దాచుకున్నదంత పోయినట్లే అని తెలుస్తోంది. ఇక తరువాత జనగణమన ప్రాజెక్ట్ కోసం చేతిలో రూపాయి కూడా ఉండే అవకాశం లేదట. ఇక ఆ ప్రాజెక్టు తెరపైకి వచ్చే ఛాన్స్ లేనట్లే!

Post a Comment

Previous Post Next Post