త్రివిక్రమ్ ను నమ్మని మహేష్!


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో ఒక బిగ్ బడ్జెట్ సినిమా చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ సినిమా దాదాపు 200 కోట్లు భారీ బడ్జెట్లో తెరపైకి రానుంది. అయితే నిర్మాత చినబాబు ఈ సినిమాను పాన్ ఇండియా లోనే విడుదల చేయాలి అనే ఆలోచనతో ఉన్నారు. త్రివిక్రమ్ కూడా అదే తరహాలో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహేష్ బాబు మాత్రం పాన్ ఇండియా రిలీజ్ కు ఏమాత్రం సంతృప్తిగా లేడు అని తెలుస్తోంది.

త్రివిక్రమ్ పవర్ఫుల్ కథను చెప్పినప్పటికీ కూడా పాన్ ఇండియా సినిమాకు తగ్గట్టుగా ప్రజెంటేషన్ చేస్తారా లేదా అనేది మహేష్ లో కొంత ఆందోళన కలిగిస్తోంది. అంతేకాకుండా తదుపరి సినిమా రాజమౌళితో చేస్తున్నారు కాబట్టి అదే సినిమాతో పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని ఆలోచనతో మహేష్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఇప్పుడే రిస్క్ చేయడం కూడా అవసరం లేదు అని అనుకుంటున్నారట. ఏదేమైనా కూడా పాన్ ఇండియా సినిమా అంటే మహేష్ త్రివిక్రమ్ పై నమ్మకంగా లేడు అని తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది.

Post a Comment

Previous Post Next Post