కార్తికేయ 2 - మూవీ రివ్యూ


కథ:
డాక్టర్ కార్తికేయ (నిఖిల్) మూఢనమ్మకాల వెనుక ఎక్కువగా శాస్త్రీయ తర్కాన్ని కనుగొనే హేతుబద్ధమైన వ్యక్తి. ఇక ఒక ఘటనతో శ్రీకృష్ణునికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అంశంపై కార్తికేయ ఫోకస్ పడుతుంది. ఈ తరుణంలో స్వాతి (అనుపమ పరమేశ్వరన్), శ్రీనివాస రెడ్డిలతో అనుకోకుండా అతను శ్రీకృష్ణుని ఆభరణాల కోసం వెతుకుతున్న ముఠాల కారణంగా ఇబ్బందుల్లో పడతాడు.  ఇక ఆ తరువాత కార్తికేయ ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? ఆ తరువాత అతను ఎలాంటి సాహసం చేయాల్సి వచ్చింది? ఈ క్రమంలో శ్రీకృష్ణ పరమాత్మ గురించి అతను ఏం తెలుసుకున్నాడు అనేది సినిమా అసలు కథాంశం.

విశ్లేషణ:
2014లో వచ్చిన కార్తికేయ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన కార్తికేయ 2పై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. దర్శకుడు చందు మొండేటి సీక్వెల్ కి వచ్చే సరికి కథ లీడ్ ను అందుకోవడం మేజర్ ప్లస్ పాయింట్. కథ కొనసాగుతున్న కొద్దీ ఆడియెన్స్ చాలా కనెక్ట్ అవుతుంటారు అని చెప్పవచ్చు. విభిన్నమైన బ్యాక్‌డ్రాప్  కొత్త ఎలిమెంట్స్‌ని హైలెట్ చేశారు. ఇక ఇంటర్వెల్‌లో బ్లాక్ తో కూడా టీమ్ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో విజయం సాధించింది.  సెకండ్ హాఫ్ శ్రీకృష్ణుడి గురించి ఎలివేట్ చేసిన సన్నివేశాలు కూడా హైలెట్ గా నిలిచాయి.  సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ద్వారక, అలాగే ఒక వర్గం వారి చుట్టూ తిరుగుతుంది. సెకండ్ హాఫ్ లో చాలా వరకు సన్నివేశాలను ఫస్ట్ హాఫ్ సీన్స్ కు కనెక్ట్ చేసిన అడ్వెంచర్ విధానం బాగుంది.

కార్తికేయ - కార్తికేయ 2 మధ్య తేడాలు బాగానే ఉన్నాయి. ఫస్ట్ సినిమాలో ఫేక్ హారర్, మంచి మిస్టరీ అంశాలతో కూడిన చిన్న తరహా థ్రిల్లర్. సీక్వెల్ లో మాత్రం అన్ని విభాగాలలో అప్‌గ్రేడ్ చేసినట్లు అనిపిస్తుంది. ఎక్కువగా మిస్టరీ అడ్వెంచర్ జానర్‌గా హైలెట్ అయ్యింది.  కొంత నిజాలను హైలెట్ చేస్తున్నట్లు ప్రజెంట్ చేసిన దర్శకుడు మరొకవైపు ఆధ్యాత్మిక అనుభూతిని కూడా చాలా బాగా తెరపైకి తీసుకువచ్చాడు. ఎక్కడ కూడా ఇలాంటి సెన్సిటివ్ అంశాలను పాడు చేయకుండా చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు. ప్రస్తుతం హిందూ సినిమాలపై వస్తున్న రెస్పాన్స్ కు ఇది కమర్షియల్ గా చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.

అంతేకాకుండా మంచి పాన్ ఇండియా సినిమాగా కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఇక నటీనటుల విషయంలో కార్తికేయగా నిఖిల్ నటించిన విధానం కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అడ్వెంచర్స్ సన్నివేశాల్లో అతను చూపించిన హావభావాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక మరోవైపు హీరోయిన్ అనుపమ పాత్ర ఎక్కువగా అంతగా హైలెట్ కాలేదు. ఇక మిగిలినవారు వారి పాత్రకు తగ్గట్టుగా అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. కొన్ని సన్నివేశాలు హైలైట్ అయ్యాయి అంటే అందుకు కాలభైరవను మెచ్చు కోవాల్సిందే. ఇక కొన్ని ఊహించే సన్నివేశాలు అలాగే అనవసరమైన పాత్రలు తప్పితే సినిమాలో పెద్దగా మైనస్ అని చెప్పడానికి ఏమీ లేదు. కానీ ఫస్ట్ ఆఫ్ లో కొంత నీరసంగా అనిపించే సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఫైనల్ గా కార్తికేయ మాత్రం ఈ హాలిడే సీజన్స్ లో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకునే చిత్రంగా నిలుస్తుంది అని చెప్పవచ్చు.

ప్లస్ పాయింట్స్:
👉శ్రీకృష్ణ బ్యాక్ డ్రాప్
👉అడ్వెంచర్ సీన్స్
👉నిఖిల్ రోల్

మైనస్ పాయింట్స్:
👉ఫస్ట్ హాఫ్
👉కొన్ని ఊహించే సన్నివేశాలు

రేటింగ్: 3.25/5

Post a Comment

Previous Post Next Post