Type Here to Get Search Results !

మాచర్ల నియోజకవర్గం - మూవీ రివ్యూ


కథ:
మాచర్ల నియోజకవర్గంలో మొదలయ్యే ఈ కథలో ఒక MLA చనిపోవడంతో రాజప్ప (సముద్రఖని) తన ఆధీనంలోకి తీసుకుంటాడు. అతనిపై పోటీ చేసేందుకు అందరూ భయపడుతున్న సమయంలో సివిల్ టాపర్ గా నిలిచిన సిద్ధూ (నితిన్) గుంటూరులో కలెక్టర్ గా నియమితుడవుతాడు. అనంతరం మాచర్ల పరిస్థితులు తెలుసుకున్న సిద్ధూ అసలు అక్కడ ఉన్న సమస్య ఏమిటి? ఈ సందిగ్ధంలో రాజప్పను హీరో ఎలా ఎదిరిస్తాడు? అనంతరం హీరోయిన్ ఫాదర్ ను అందులోకి ఎలా లాగుతారు? చివరికి రాజప్పపై సిద్ధూ ఎలా గెలిచాడు అనేది సినిమా అసలు కథ. 

విశ్లేషణ:
పక్కా మాస్ కమర్షియల్ సినిమాలతో సక్సెస్ అందుకోవడం అంటే ఈ రోజులలో కాస్త కష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఆడియోన్స్ రొటీన్ కమర్షియల్ సినిమాలకు స్వస్తి చెప్పారు. ఎక్కడో కొన్ని ఊహించని వాతావరణంలో మాస్ ఎలివేషన్స్ సక్సెస్ అవుతున్నాయి కానీ పూర్తిస్థాయిలో మాత్రం వర్కౌట్ కావడం లేదు. ఇక మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా మొదటి నుంచి కాస్త అనుమానాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే.. 

అసలు దర్శకుడు మొదట ఈ కథను ఎంత కొత్తగా రాశాడు అనే విషయం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇలాంటి కమర్షియల్ రొటీన్ పాయింట్స్ ఇంతకుముందు వెండి తెరపై చాలాసార్లు వచ్చాయి. ఒక నియోజకవర్గంలో ఒక విలన్ ఆ తరువాత అతని రాజకీయ దుర్మార్గం ఆ తర్వాత ఒక యువ హీరో కలెక్టర్గా మారి అతని ఎదుర్కొన్న విధానం ఈ రోజుల్లో ఆడియన్స్ కు ఇలాంటి లైన్స్ ఏమి అంతగా కనెక్ట్ అవ్వమని చెప్పాలి.

పోనీ మేకింగ్ లో అయినా ఏదైమా కొత్తగా ఉందా అంటే అదేమీ లేదు. ఇక దానికి తోడు రొటీన్ కామెడీ సీన్స్ ఊహించగలిగే వార్నింగ్ లు అలాగే చిరాకు తెప్పించే పాటలు ఇవన్నీ కూడా మాచర్ల నియోజకవర్గం లో కావాల్సినంత ఉన్నాయి. క్లియర్ గా చెప్పాలంటే.. మొదట హీరో ఇంట్రడక్షన్ ఆ తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్ కట్ చేస్తే మరో సాంగ్ ఆ తర్వాత మరొక హీరోయిన్ ఇంట్రడక్షన్ ఆ తర్వాత మరొక సాంగ్ ఈ మధ్యలో వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ ఇంటర్వెల్ బ్లాక్ లో యాక్షన్ సీన్ మళ్లీ కట్ చేస్తే హీరో కలెక్టర్ ఆ తర్వాత విలన్ వార్నింగులు హెచ్చరికలు ఆ తర్వాత రొటీన్ క్లైమాక్స్.

సినిమాలో ఇంతకంటే సింపుల్ పాయింట్స్ తప్పితే కొత్తగా ఏమీ లేవు. ఎక్కడో అక్కడక్కడ వెన్నెల కిషోర్ కొన్ని సన్నివేశాలు మాత్రమే ఆకట్టుకున్నాయి. ఇక సెకండ్ హాఫ్ లో రారా రెడ్డి అనే పాట విజువల్ గా చాలా బాగుంది. ఇక మహతి సాగర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని ఫైట్స్ అన్ని విషయాల్లో మాత్రం పరవాలేదు అనిపించింది. కెమెరా పనితనం కూడా బాగుంది. ఇక కేథరిన్ కృతి శెట్టి పాత్రలో అంత కొత్తగా కూడా ఏమీ లేవు.

నితిన్ అయితే ఇంకా తన నటనలో చాలా మెరుగు అవ్వాలి అని చెప్పాలి. కలెక్టర్ గా అతను చెప్పిన డైలాగ్స్ ఐతే వెండితెరపై ఎదో యాక్టింగ్ చేసినట్లు కనిపించింది. కానీ అక్కడ సిద్దు ఐపీఎస్ ఏమి కనిపించడు. ఇక రాజప్ప గా సముద్రఖని యాక్టింగ్ బాగుంది. ఇక దర్శకుడు రాజశేఖర్ ఈ సినిమాలో కొన్ని యాక్షన్ బ్లాక్స్ మాత్రమే సరైన ఎలివేషన్స్ తీసుకున్నాడు గాని డ్రామా విషయంలో మాత్రం అంతగా ఫోకస్ పెట్టలేదు అనిపిస్తుంది. మొత్తంగా మాచర్ల నియోజకవర్గం సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ కు ఆకట్టుకోవాలని అనుకుంది కానీ పూర్తిస్థాయిలో మాత్రం సినిమా మేకింగ్ స్క్రీన్ ప్లే అస్సలు సెట్ అవ్వలేదు. మరి ఈ సినిమాను ఆడియన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో చూడాలి.

ప్లస్ పాయింట్స్:
👉యాక్షన్ సన్నివేశాలు
👉బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, స్పెషల్ సాంగ్ 

మైనస్ పాయింట్స్:
👉రోటీన్ స్క్రీన్ ప్లే
👉ఫస్ట్ హాఫ్

రేటింగ్: 2.25/5

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies