శాకిని డాకిని డైరెక్టర్.. గొడవేంటి?


స్వామిరారా సినిమాతో నిఖిల్ కెరీర్ కు మంచి బూస్ట్ ఇచ్చిన సుధీర్ వర్మ ఆ తరువాత మళ్ళీ అలాంటి సక్సెస్ అందుకోలేదు. దోచేయ్ డిజాస్టర్ తర్వాత ఆ మధ్య నిఖిల్ తోనే కేశవ తీశాడు కానీ అది జస్ట్ యావరేజ్ టాక్ అందుకుంది. అనంతరం శర్వానంద్ తో తీసిన రణరంగం అయితే డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆ సినిమా తరువాత అతను శాకిని డాకిని అనే సినిమా చేశాడు. అందులో రెజీనా, నివేత థామస్ హీరోయిన్స్ గా నటించారు.

అసలు అతను అలాంటి సినిమా చేసినట్లు రిలీజ్ డేట్ చెప్పే వరకు తెలియలేదు. నిర్మాత సురేష్ బాబు, సునీత తాటి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. అయితే సుధీర్ వర్మ ఇప్పుడు రవితేజతో రావణాసుర అనే సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలో అతను శాకిని డాకిని ఈ నెల 16న విడుదల అవుతున్నా కూడా కనీసం చిన్న ట్వీట్ కూడా వేయడం లేదు. నిర్మాతలతో విబేధాలు తలెత్తినట్లు టాక్ వస్తోంది. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో దర్శకుడికి తెలియకుండా మరో దర్శకుడి సలహా మేరకు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఆ సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉంటున్నట్లు టాక్.

Post a Comment

Previous Post Next Post