కిరణ్ అబ్బవారం.. ఈసారి మాస్ ర్యాంపేజ్!


సినిమా ఇండస్ట్రీలో సపోర్ట్ లేకుండా టాలెంటెడ్ హీరోగా మంచి గుర్తింపు అందుకున్న అతికొద్దిమందిలో కిరణ్ అబ్బవరం ఒకరు. మొదటి సినిమాతో రాజావారు రాణి గారు అంటూ చాలా సింపుల్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన అతను ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం, సమ్మతమే సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అందించే హీరోగా గుర్తింపును అందుకున్నాడు. 

అయితే ఇప్పటివరకు వచ్చిన సినిమాలో ఒక లెక్క ఇప్పుడు రాబోయే సినిమాలు మరొక లెక్క అనే తరహాలో కిరణ్ కొనసాగుతున్న విధానం ఆసక్తిని కలిగిస్తోంది. ఈనెల 16వ తేదీన అతని నుంచి రాబోతున్న 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' సినిమా ట్రైలర్ తోనే అంచనాలను క్రియేట్ చేసింది. కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. ఇక ఎస్ఆర్ కళ్యాణమండపం దర్శకుడు శ్రీధర్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడం విశేషం.

ఈ సినిమాలో కిరణ్ గతంలో ఎప్పుడు లేని విధంగా పూర్తిగా మాస్ స్టైల్లో మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. ట్రైలర్ లోనే అతని మాస్ స్టైల్ ఆడియన్స్ లో అంచనాలను క్రియేట్ చేసింది. ఇప్పటివరకు లవర్ బాయ్ గా ఫ్యామిలీ బాయ్ గా మంచి పాత్రలు చేసిన కిరణ్ ఇప్పుడు మాస్ హీరోగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాడు. సినిమా విడుదలకు ముందే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. మరి బాక్సాఫీస్ వద్ద 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' ఎలాంటి ప్రాఫిట్ అందిస్తుందో చూడాలి.

Post a Comment

Previous Post Next Post