శర్వా హిట్ టాక్ అందుకున్నా.. నష్టాలు తప్పేలా లేవు!


2017 లో వచ్చిన మహానుభావుడు సినిమా తర్వాత శర్వానంద్ వరుసగా డిజాస్టర్స్ ఎదుర్కొన్నాడు. పడి పడి లేచే మనసు, రణరంగం, జాను, శ్రీకారం, మహా సముద్రం, ఆడవాళ్లు మీకు జోహార్లు ఇలా వరుసగా  అరడజను పరాజయాలను ఎదుర్కొన్న హీరో శర్వానంద్ ఇటీవల విడుదల చేసిన తన సైన్స్ ఫిక్షన్ డ్రామా, ఒకే ఒక జీవితం సినిమాతో కొంచెం మౌత్ టాక్ తోనే పాజిటివ్ కలెక్షన్స్ అందుకున్నాడు.

శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే వీకెండ్ వరకు డీసెంట్ కలెక్షన్స్ అందుకున్న ఈ సినిమా సోమవారం వచ్చేసరికి కలెక్షన్స్ పరంగా డౌన్ అయ్యింది. పెట్టిన పెట్టుబడి రావడం కష్టంగానే ఉంది. తమిళ్ లో కూడా అంతగా క్లిక్ అవ్వలేదు. ఒకానొక సమయంలో శర్వానంద్ భారీ చిత్రాలతో పోటీ పడినప్పటికీ సంక్రాంతి మరియు దసరా సీజన్లలో మహానుభావుడు, రన్ రాజా రన్ వంటి భారీ హిట్‌లను అందించాడు. అయితే ఇప్పుడు అతని సినిమాలకు పాజిటివ్ మౌత్ టాక్ ఉన్నప్పటికీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం లేదు. శర్వానంద్ గత ఆరు ఫ్లాపుల ప్రభావం ఒకే ఒక జీవితం బాక్సాఫీస్ కలెక్షన్లను ఖచ్చితంగా దెబ్బతీస్తోందనే చెప్పాలి. మరి తదుపరి సినిమాలతో అయినా శర్వా బాక్సాఫీస్ వద్ద టెన్షన్ లేకుండా క్లీన్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post