నాని న్యూ ప్రాజెక్ట్.. మైత్రి మేకర్స్ లో విబేధాలు?


ఏడాదికి మూడు సినిమాలను విడుదల చేసుకుంటూ వచ్చిన నేచురల్ స్టార్ నాని కరోనా తర్వాత స్లో అయ్యాడు.  ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడు దర్శకత్వంలో దసరా సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా 2023 మార్చి 30న విడుదల కానుంది. అలాగే నాని మరో ప్రాజెక్ట్‌కు కూడా సంతకం చేసాడు. దీనికి కొత్త దర్శకుడు దర్శకత్వం వహించనున్నాడు.  


అయితే మైత్రీ మూవీ మేకర్స్ పార్టనర్‌లలో ఒకరైన సివి మోహన్ (చెరుకూరి మోహన్) ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించనున్నారు. చెరుకూరి మోహన్ తన భాగస్వాములతో విభేదాల కారణంగా మైత్రీ మూవీ మేకర్స్ నుండి బయటకు వచ్చేశాడు. ఇక అతను సొంతంగా ప్రాజెక్ట్‌లను ప్రకటించడానికి ప్రయత్నిస్తున్నాడు. కొంత మంది స్టార్స్ కు అలాగే దర్శకులకు అడ్వాన్స్‌లు చెల్లించాడు. ఇక ఈ న్యూ ప్రొడక్షన్ హౌస్ త్వరలో నాని సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేయనుంది. ఈ ఏడాది అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post