నేచురల్ స్టార్ నాని నటించిన చివరి రెండు సినిమాలు కూడా పూర్తిస్థాయిలో అయితే బాక్సాఫీస్ వద్ద రికార్డులు ఏమి క్రియేట్ చేయలేదు. శ్యామ్ సింగరాయ్ పర్వాలేదు అనిపించింది కానీ ఆ తర్వాత వచ్చిన అంటే సుందరానికి చాలా వరకు నష్టాలను మిగిల్చింది. ఇక ఇప్పుడు అతని ఆశలు మొత్తం దసరా సినిమా పైనే ఉన్నాయి. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమా బడ్జెట్ లిమిట్స్ దాటిపోవడంతో మరో నిర్మాత టేకోవర్ చేసే అవకాశం ఉన్నట్లు మొన్నటి వరకు ఒక టాక్ వచ్చింది. కానీ అందులో నిజం లేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ఇప్పటికే పెట్టిన పెట్టుబడిన నాన్ తియేట్రిక్ గా వెనక్కి తీసుకువచ్చే విధంగా డీల్స్ సెట్ అయినట్లు అనిపిస్తోంది. ముందుగా ఓటీటీ అలాగే శాటిలైట్ మిగతా భాషల కు సంబంధించిన హక్కులు మొత్తం చూసుకుంటే ఈ సినిమా దాదాపు 60 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ గా దాదాపు 40 కోట్ల వరకు బిజినెస్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా మొత్తంగా సినిమా దాదాపు 100 కోట్ల బిజినెస్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉందట.
Follow
Very funny. Nani movie ki 60cr non theatrical comedy.
ReplyDeletePost a Comment