100 కోట్ల హీరోకు జాతిరత్నం హిట్టిస్తాడా?


జాతిరత్నాలు సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న అనుదీప్ ఇప్పుడు తన రెండవ సినిమా ప్రిన్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ హడావిడి ఇంకా మొదలు కాలేదు కానీ తప్పకుండా శివకార్తికేయన్ సినిమా అంటే తెలుగు ఆడియెన్స్ కూడా ఆసక్తి చూపే అవకాశం ఉంది. 

దీపావళి 21న రానున్న ఈ సినిమా తెలుగు తమిళ్ లో ఒకేసారి విడుదల కానుంది. ఇక ఈ సినిమా కంటే ముందు శివకార్తికేయన్ చేసిన డాన్, డాక్టర్ అనే రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు అందుకున్నాయి. ఇక డైరెక్టర్ అనుదీప్ జాతిరత్నాలు సినిమా పెట్టిన పెట్టుబడి మూడింతల లాభాలను అందించింది. కాబట్టి ఈ కాంబినేషన్ ఏ మాత్రం క్లిక్ అయినా కూడా శివకార్తికేయన్ కు తెలుగులో కూడా బిగ్ హిట్ వచ్చినట్లే. మరి ఈ సినిమాతో ఈ ఇద్దరు ఎలాంటి వండర్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post