మహేష్ సినిమా 300 కోట్లు.. అంత లేదన్న నిర్మాత!


మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న కొత్త సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. అయితే ఈ సినిమాకు షూటింగ్ మొదలు కాకముందు నుంచే ఆఫర్లు వస్తున్నాయని నిర్మాతలు కొన్ని నెంబర్లు కూడా కోట్ చేస్తున్నట్లుగా టాక్ అయితే వచ్చింది. ముఖ్యంగా 300 వందల కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉంది కథనాలు వెలుపడ్డాయి.

అయితే నిర్మాత నాగవంశి మాత్రం అంత లేదు అంటూ చాలా తేలిగ్గా కొట్టి పారేశారు. అసలు ఇంకా ప్రొడక్షన్ కాస్ట్ క్లారిటీ రాలేదు అంటూ షూటింగ్ కొనసాగుతున్న తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని అప్పటివరకు ఏమి చెప్పలేము అని అన్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ లో అయితే ఎంత మాత్రం నిజం లేదు అని 300 కోట్ల రేంజ్ లో అయితే బిజినెస్ చేయకపోవచ్చు అని వంశీ మాత్రం చాలా తేలిగ్గా చెప్పారు. మరి ఈ సినిమా కు ఎలాంటి ఆఫర్లు వస్తాయో చూడాలి.

Post a Comment

Previous Post Next Post