నితిన్ వరుసగా 4 ఇంటరెస్టింగ్ సినిమాలు!


యంగ్ హీరో నితిన్ గత కొంతకాలంగా వరుసగా అపజయాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. చివరిగా వచ్చిన మాచర్ల నియోజకవర్గం కూడా డిజాస్టర్ అయ్యింది. ఇక ప్రస్తుతం అతను వరుసగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. ముందుగా 'నా పేరు సూర్య' డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతోంది.

అలాగే మాస్ యాక్షన్ దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా నితిన్ తో ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఆ దర్శకుడు అఖిల్ ఏజెంట్ సినిమాను తెరపైకి తీసుకొస్తున్నాడు. అలాగే యువ దర్శకుడు వెంకీ కుడుముల కూడా మరోసారి నితిన్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఇదివరకే వీరి కలయికలో భీష్మ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇక భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ కే చంద్ర కూడా నితిన్ కోసం ఇదివరకే ఒక కథను సెట్ చేశాడు. ఈ ప్రాజెక్టుపై కూడా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Post a Comment

Previous Post Next Post