హిందీలో మరోసారి మాస్ రాజా?


రవితేజ చివరిసారిగా రామారావు ఆన్ డ్యూటీతో డిజాస్టర్ ఎదుర్కొన్నాడు.  ఇప్పుడు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన ధమాకాపై ఈ మాస్ హీరో చాలా ఆశలు పెట్టుకున్నాడు. పెళ్లి సందడి ఫేమ్ శ్రీ లీల కథానాయికగా నటించిన ఈ ఔట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ త్వరలోనే విడుదల కానుంది.

ఇక ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలు బాగానే ఆకట్టుకున్నాయి. అయితే రవితేజ నటించిన ఈ చిత్రం హిందీలో కూడా ఒకేసారి విడుదలయ్యే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. నార్త్ ప్రేక్షకులలో రవితేజకు మంచి ఫాలోయింగ్ ఉంది, దీంతో అక్కడ కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కానీ ఇంతకుముందు ఖిలాడి హిందీలో రిలీజ్ చేసి డిజాస్టర్ అందుకున్నారు. మరి ఇప్పుడైనా ఈ సినిమా వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టిజి విశ్వ ప్రసాద్ మరియు వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post