Subscribe Us

అదిపురుష్.. అప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?

 


ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమాపై వచ్చిన నెగిటివ్ టాక్ విడుదల డేట్ పై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి కి అసలే బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ నెలకొంది. అందరికంటే ముందే సంక్రాంతి కి రానున్నట్లు చిత్ర యూనిట్ ఎనౌన్స్ చేసినప్పటికీ ఇప్పుడు మాత్రం విడుదల తేదిని మార్చే ఆలోచనలో ఉన్నారట.

బాలయ్య వీరసింహా రెడ్డి - విజయ్ వారసుడు, మెగాస్టార్ వాల్తేరు వీరయ్య.. సంక్రాంతికి తమ స్లాట్‌లను ఖాయం చేసుకున్నాయి.  అయితే సంక్రాంతికి పెద్ద సినిమాలు పోటీ పడుతుండటంతో ప్రభాస్ సినిమాకి థియేటర్స్ దొరికినా కాస్త కష్టమే. టీజర్ కూడా ట్రేడ్‌లో నెగిటివ్ ఇంప్రెషన్ తెచ్చిపెట్టింది.  అందుకే ఇతర పెద్ద చిత్రాలతో ప్రదర్శించేందుకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆసక్తి చూపడం లేదు.  కాబట్టి, ‘ఆదిపురుష్’ నిర్మాతలు జనవరిలోనే సంక్రాంతి కంటే ఒక వారం ముందు లేదా  ఆ తరువాత రావచ్చని టాక్.



Post a Comment

0 Comments