విజయ్ దేవరకొండ.. మరో న్యూ ప్రాజెక్ట్?


విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తర్వాత మరొక కొత్త ప్రాజెక్టును ఓకే చేయడానికి చాలా ఆలోచిస్తున్నాడు. ఇటీవల తనకి రెండు ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం ఒప్పుకోలేదట. అయితే ఒక దర్శకుడు చెప్పిన కథకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతమైతే విజయ్ శివ నిర్మాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా ఫినిష్ చేయాల్సి ఉంది. అయితే ఈ క్రమంలో విజయ్ దేవరకొండ జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి చెప్పిన కథకు ఓకే చెప్పినట్లు టాక్ అయితే కనిపిస్తోంది. డిఫరెంట్ త్రిల్లర్ మూవీగా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందట. అయితే గౌతమ్, రామ్ చరణ్ తో కూడా ఒక సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆ ప్రాజెక్టు స్క్రిప్ట్ దాదాపు ఫినిష్ అయింది. శంకర్ సినిమాతో బిజీగా ఉండడం వలన గౌతమ్ ప్రాజెక్ స్టార్ట్ కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక రామ్ చరణ్ సినిమా తరువాత విజయ్ గౌతమ్ కలిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post