త్రివిక్రమ్ - ప్రభాస్.. ఏమైందంటే?


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రభాస్ తో సినిమా చేయాలి అని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ హీరో మాత్రం దొరకడం లేదు. ఒక విధంగా త్రివిక్రమ్ తో వర్క్ చేయాలి అని ప్రభాస్ కి కూడా చాలా ఇష్టంగానే ఉంది కానీ ప్రభాస్ ఏదో ఒక కమిట్మెంట్ తో బిజీగా ఉండడంతో అసలు గ్యాప్ ఉండడం లేదు. అయితే రీసెంట్ గా సితార ఎంటర్టైన్మెంట్స్ హారిక హాసిని నిర్మాతల్లో ఒకరైన నాగ వంశీ  ఆ కాంబినేషన్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

సాహో సమయం నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని కానీ సెట్ అవ్వలేదు అన్నారు. అలాగే త్రివిక్రమ్ కూడా ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వలన ప్రభాస్ ఖాళీగా ఉన్నప్పుడు అవకాశం దొరకడం లేదు అని తెలియజేశాడు. కానీ తప్పకుండా ప్రభాస్ తో అయితే ఒక సినిమా చేయడానికి ప్రయత్నం చేస్తాము అని అలాగే లిస్టులో రామ్ చరణ్ మరి కొంత మంది హీరోలు కూడా ఉన్నట్లు నాగ వంశీ వివరణ ఇచ్చాడు.

Post a Comment

Previous Post Next Post