బాలయ్య - అనిల్ జెట్ స్పీడ్ ప్లాన్!


గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా షూట్ టర్కీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక త్వరలో బాలయ్య సెలబ్రిటీ టాక్ షో అన్‌స్టాపబుల్ 2 సెట్స్‌లో చేరనున్నారు. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఒక మాస్ ఎంటర్‌టైనర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా స్క్రిప్ట్‌వర్క్ పూర్తయింది.  

ఇక ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ మధ్యలో ప్రారంభమవుతుంది. అనిల్ రావిపూడి ప్రస్తుతం నటీనటులు సాంకేతిక నిపుణులను ఖరారు చేస్తున్నాడు.  థమన్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి బాలకృష్ణ ఎన్నడూ చూడని లుక్ లో కనిపించబోతున్నాడు. ఇక  2023 వేసవికి చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ఆసక్తిగా ఉన్నారు. అనిల్ రావిపూడి మరియు బాలకృష్ణ బ్యాక్-టు-బ్యాక్ షెడ్యూల్స్‌లో రికార్డ్ టైమ్‌లో షూట్ పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post