మహేష్ - త్రివిక్రమ్.. మళ్ళీ మొదటి కథే!

మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే వీరి కాంబినేషన్ సెట్ కావడానికి చాలా సమయం పట్టింది. దర్శకుడు త్రివిక్రమ్ మొదట అనుకున్న కథను మహేష్ బాబుకు నచ్చకపోవడంతో మళ్లీ మరో కథను ఫైనల్ చేసి షూటింగ్ కూడా మొదలుపెట్టారు. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆ సినిమా తరికెక్కించాలి అని దర్శకుడు అనుకున్నాడు.

కానీ మళ్ళీ మహేష్ బాబుకు ఏమనిపించిందో ఏమో కానీ ఆ కథ వద్దని మొదట అనుకున్న కథను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అది కూడా త్రివిక్రమ్ కొంత చేంజ్ చేసి మొదట అనుకున్న కథను ఇప్పుడు తెరపైకి తీసుకురాబోతున్నాడు. ఇక పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో ఫుల్ మాస్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీసుకువస్తున్నారు.  పూజా హెగ్డే మేయిన్ హీరోయిన్ కాగా సెకండ్ హీరోయిన్ గా శ్రీలీలను ఫిక్స్ చేసుకుంటున్నారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మొదటిసారి త్రివిక్రమ్ ఒక స్టార్ హీరోయిన్ తో ఐటెమ్ సాంగ్ చేయించబోతున్నాడు. ఇక డిసెంబర్ లో రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది. అయితే ఈ ప్రాజెక్ట్ మాత్రం బౌండెడ్ స్క్రిప్ట్ తో వెళ్లడం లేదని తెలుస్తోంది.

Post a Comment

Previous Post Next Post