కృష్ణగారి పరిస్థితి క్లిష్టంగానే ఉంది: వైద్యులు

 


టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. నమ్రత ప్రత్యేకంగా ఆయనను ఉదయం హాస్పిటల్ లో జాయిన్ చేయించారు. ఇక కృష్ణ గారికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలో వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.


డాక్టర్స్ మాట్లాడుతూ.. ఏ పేషెంట్ కు అయినా కూడా లాస్ట్ వరకు కూడా మా ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. శరీరం సహకరిస్తుందా లేదా అనేది చెప్పడం కూడా ఉహీంచలేము. కానీ చేయాల్సినవన్ని అంతర్జాతీయ హాస్పిటల్స్ లో జరిగే చికిత్స కూడా ఈ కాంటినెంట్ హాస్పిటల్లో ఆయనకు అందిస్తున్నాము. ఆయన కోలుకోవాలని మనందరం కూడా ప్రార్థిద్దాం.

ప్రస్తుతం కృష్ణ గారి పరిస్థితి అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనే ఉంది. అనారోగ్యానికి సంబంధించిన కారణాలు ఉన్నాయి. అయితే అవన్నీ కూడా ఇప్పుడు చర్చించడం సరైనది కాదు. ఇక కృష్ణ గారి కుటుంబ సభ్యులు అందరూ కూడా హాస్పిటల్ లోనే ఉన్నారు. ఇక ఆయనకు ఎలాంటి టెస్టులు నిర్వహిస్తున్నాము? అలాగే ఇంకా మరిన్ని విషయాల గురించి.. రేపు ఒకటి గంటలకు చెబుతామని వైద్యులు వివరణ ఇచ్చారు.

Post a Comment

Previous Post Next Post