కాంటినెంటల్ హాస్పిటల్ లో కృష్ణ గారు గుండెపోటు కారణంగా జాయిన్ అయిన విషయం తెలిసిందే. నమ్రత ప్రత్యేకంగా కృష్ణ గారిని ఉదయమే హాస్పిటల్ లో జాయిన్ చేసి వైద్యులతో మాట్లాడారు. ఇక ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్ కు చేరుకున్నారు. మహేష్ బాబు ప్రత్యేకంగా వైద్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు. గంట గంటకు ఆయన పరిస్థితి గురించి కూడా వైద్యులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక కొద్ది సేపటి క్రితం అందిన సమాచారం ప్రకారం ఆయన పరిస్థితి మరింత క్రిటికల్ గానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు మళ్లీ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఆయన పరిస్థితి మరికొంత క్షీణించినట్లుగా చెబుతున్నారు. ఇక వైద్యులు ఆయనను కాపాడడానికి తీవ్రంగా శ్రమిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రత్యేకంగా కృష్ణ గారిని హాస్పిటల్ లో ఉన్న టాప్ 8 మంది డాక్టర్లు పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ప్రతి నిమిషం కూడా కృష్ణ గారి ఆరోగ్యం గురించి వారు ఎంతగానో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కృష్ణ గారు కోలుకోవాలని అభిమానులు కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. మన సూపర్ స్టార్ కృష్ణ మళ్లీ నవ్వుతూ మనందరికీ ముందుకు రావాలి అని కోరుకుందాం.
Follow
2 Comments
Thanks for your updates....we hope and pray the GOD to recover him.
ReplyDelete100/ sir
ReplyDelete