కన్ను మూసిన సూపర్ స్టార్ కృష్ణ!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎనలేని గుర్తింపు అందుకున్న సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ ఇకలేరు. గత 24 గంటల నుంచి ఆయన ప్రాణాలతో పోరాడుతూ కాంటినెంటల్ హాస్పటల్లో తుది శ్వాస విడిచారు. వైద్యులు ఆయనను రక్షించేందుకు ఎంతగానో ప్రయత్నం చేశారు. ఆదివారం అర్ధరాత్రి గుండెపోటు కారణంగా హాస్పిటల్ లో చేరిన కృష్ణ తప్పకుండా మళ్ళీ వెనక్కి వస్తారు అని అందరూ ఎదురు చూశారు.


అయితే ప్రతిక్షణం ఆయన ఆరోగ్యం క్షిణిస్తూ ఉండడంతో పరిస్థితి మరింత విషమంగా మారిపోయింది. గుండెపోటు కారణంగా ఇతర అవయవాలపై కూడా ప్రభావం పడింది. చివరి వరకు ఆయనను వెంటిలేటర్ పైన చికిత్స అందించారు. టాప్ డాక్టర్స్ ఆయన చుట్టూ దాదాపు చివరి శ్వాస వరకు ఆయన పరిస్థితిపై ఎంతో బాగా కేర్ తీసుకున్నారు. అయినప్పటికీ చివరికి ఆయన అవయవాలు శరీరం సహకరించకపోవడంతో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూశారు. ఇక కృష్ణ గారు మృతి చెందారు అనే వార్త అభిమానులు అందరిని కూడా ఆశ్చర్యాన్ని గురిచేసింది. ఇక ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని Tollywoodboxoffice శ్రద్ధాంజలి ఘటిస్తోంది.

Post a Comment

Previous Post Next Post