ఇప్పుడున్న దర్శకుల పరిస్థితి అయితే చాలా క్లిష్టంగా మారిపోయింది. ఒక సినిమా సక్సెస్ అయితే మళ్లీ ఆ తర్వాత సినిమాతో కూడా సక్సెస్ అందుకోవాల్సిందే. ఏమాత్రం డిజాస్టర్ అందుకున్నా కూడా అంతకుముందు ఒప్పుకున్న కమిట్మెంట్స్ కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇక రీసెంట్ గా గాడ్ ఫాదర్ కారణంగా దర్శకుడు మోహన్ రాజా తెలుగులో చేయాల్సిన ఒక ప్రాజెక్టును పోగొట్టుకున్నట్లుగా తెలుస్తోంది.
గాడ్ ఫాదర్ సినిమా మొదట్లో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకున్నప్పటికీ రోజులు గడిచిన కొద్ది ఆ సినిమాకు కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద చాలా ఏరియాల్లో కూడా నష్టాలు చూడాల్సి వచ్చింది. అయితే ఆ ప్రాజెక్ట్ సెట్స్ పై ఉన్నప్పుడే మోహన్ రాజా, నాగార్జునతో ఒక సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశాన్ని అందుకున్నాడు. దాదాపు ఒక కథ కూడా ఫైనల్ అయినట్లుగా ఇద్దరి మధ్య చర్చ అయితే నడిచింది. కానీ గాడ్ ఫాదర్ అనుకునేంత స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో నాగార్జున మళ్ళీ కాస్త వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. ఇక మోహన్ రాజా తదుపరి సినిమాను తమిళంలోనే ప్లాన్ చేసుకుంటున్నట్లు టాక్.
Follow

Post a Comment