బాలీవుడ్ మూవీలో రౌడీ.. అయ్యే పనేనా?

 


రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇటీవల లైగర్ సినిమాతో ఊహించిన విధంగా దెబ్బ తిన్నాడు. అయినప్పటికీ కూడా అతను తదుపరి సినిమా ఖుషిపై కొంత నమ్మకం అయితే ఉన్నట్లు బిజినెస్ డీల్స్ తో అర్ధమవుతోంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అతను వరుసగా సినిమాలను చేయడానికి కరణ్ జోహార్ తో ప్రణాళికలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అయితే మొదట లైగర్ విడుదల కాకముందు నిర్మాత కరణ్ జోహార్ బ్రహ్మాస్త్ర 2 సినిమాలో విజయ్ తో ఒక పాత్ర చేయించాలని అనుకున్నాడట. ఫస్ట్ పార్ట్ లో కాకుండా సెకండ్ పార్ట్ లో అయితే అతను ఒక క్యారెక్టర్ కు కరెక్ట్ గా సెట్ అవుతాడు అని విజయ్ తో కూడా చర్చలు జరుపినట్లు తెలుస్తోంది. అయితే లైగర్ రిజల్ట్ తో మళ్ళీ ఒక్కసారిగా కరణ్ జోహార్ ఆ విషయంపై మౌనం పాటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక రెండు సినిమాలు చేయాలని కమిట్మెంట్ అయితే తీసుకున్నాడు. మరి అందులో బ్రహ్మాస్త్ర ఉంటుందా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి.

Post a Comment

Previous Post Next Post