యశోద ఓటీటీ రైట్స్.. సగం సేఫ్!


సమంత యశోద సినిమాకు బడ్జెట్ దాదాపు 30 నుంచి 40 కోట్ల మధ్యలో అయినట్లు నిర్మాత చెప్పారు. అయితే ఈ సినిమా మొదటి రోజు టాక్ ను బట్టి చూస్తే కలెక్షన్స్ కూడా చాలా తక్కువగానే రానున్నట్లు అనిపిస్తోంది. పెద్దగా హౌస్ ఫుల్స్ అయిన నెంబర్స్ ఏమి కనిపించలేదు. పాన్ ఇండియా అనే మాట గాని అసలు తెలుగులో తప్పితే మిగతా భాషల్లో సినిమాకు కలెక్షన్స్ అంతగా రాలేదు.

ఇక యశోద సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 20 కోట్లకు అటు అటుగా జరిగినట్లు తెలుస్తోంది. ఇక బడ్జెట్ 35 కోట్లు అనుకున్నా నిర్మాతకు ఓటీటీ పరంగా కొంత సేఫ్ అయినట్లు తెలుస్తోంది. ఆ రూట్లో అన్ని భాషల రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ 25 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. అంటే బాక్సాఫీస్ వద్ద ఇంకా 10 కోట్లు షేర్ దక్కినా నిర్మాత సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి యశోద ఆ రేంజ్ లో వసూళ్ళను సాధిస్తుందో లేదో చూడాలి.

Post a Comment

Previous Post Next Post