యశోద సినిమాకు దాదాపు 30 నుంచి 40 కోట్ల మధ్యలో ఖర్చు అయినట్లు నిర్మాత శివలెంక ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా చేసిన బిజినెస్ చాలా తక్కువ అని తెలుస్తోంది. ఏదో 4 కోట్లతో అనుకున్న బడ్జెట్ ఆ తరువాత 30 కోట్లకు పైగా పెరగడం అంటే నిర్మాత ఎంతగా రిస్క్ చేస్తున్నాడో అర్ధమవుతోంది.
ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో 12 కోట్ల వరకు బిజినెస్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్ లో 4 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇక వరల్డ్ వైడ్ గా 16 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన యశోద బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావాలి అంటే మినిమమ్ 17 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ సాధించాలి. నాన్ థియేట్రికల్ గా నిర్మాత బడ్జెట్ లో సగం వెనక్కి తెచ్చుకున్నాడు. ఇక బాక్సాఫీస్ వద్ద ఏమైనా షేర్ వస్తుందో లేదో చూడాలి.
Follow
Post a Comment