వర్మతో వైసీపీ మరో ప్లాన్?


సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు డిఫరెంట్ సీరియస్ సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఆయన చేస్తున్న సినిమాలు కొనసాగుతున్న తీరు తీవ్ర స్థాయిలో నెగిటివ్ కామెంట్స్ ను అందిస్తోంది. ఇక రామ్ గోపాల్ వర్మ మరోసారి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లు తెలుస్తోంది. 

గతంలో వైసీపీ కి అనుకూలంగా ఉంటూ పవన్ పై వ్యతిరేకంగా కామెంట్ చేయడమే కాకుండా సినిమాలు కూడా చేశాడు. ఇక ఆ మధ్య నట్టి కుమార్ కు సంబంధించిన వివాదం తెరపైకి వచ్చినప్పుడు వైసీపీ తో ఉన్న అనుబంధం పై వర్మ ఆడియో కాల్స్ తో ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక ఇప్పుడు 2024 ఎలక్షన్స్ కు ముందు పవన్ పై సినిమాలు చేసేందుకు వర్మ డిసైడ్ అయినట్లు టాక్. మరి ఈ విషయంలో వర్మ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post