దీపిక బికినీ రెమ్యునరేషన్.. ఆ మాత్రం ఇవ్వాల్సిందే!

దీపిక పదుకొనె పఠాన్ సినిమా రేంజ్ మరో లెవెల్ కు పెంచింది. సినిమాలోని బేశారమ్ పాట కోసం అమ్మడు గతంలో కంటే హై రేంజ్ లో బికినీ అందాలతో రెచ్చిపోయింది. షారుక్ తో కూడా రొమాంటిక్ స్టెప్పులతో స్టన్ అయ్యేలా చేసింది. ఇక ఈ రేంజ్ లో బికినీ ట్రీట్ ఇచ్చినందుకు అమ్మడికి రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఇచ్చి ఉంటారని చెప్పవచ్చు.


యాష్ రాజ్ ఫిలీమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా కోసం దీపిక పదుకొనె తన కెరీర్ లోనే అత్యధికంగా 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. గతంలో సినిమాలను బట్టి 10 నుంచి 12 కోట్ల మధ్యలో తీసుకున్న అమ్మడు బికినీ కోసం ప్రత్యేకంగా మరో మూడు కోట్లు పెంచినట్లు టాక్ వస్తోంది. ఇక యాక్షన్ ఫిల్మ్ గా రాబోతున్న పఠాన్ సినిమాలో షారుక్ కూడా పవర్ఫుల్ ఫిట్నెస్ తో కనిపించబోతున్నాడు. ఇక 2023 జనవరి 25న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

Post a Comment

Previous Post Next Post