పుష్ప 2 + రంగస్థలం.. లాజిక్స్ ఉంటే ఛాన్స్ లేనట్లే!

మల్టీవర్స్ సినిమాలు ఇటీవల కాలంలో ప్రేక్షకుల్లో కూడా మంచి ఆసక్తిని కలిగిస్తున్నాయి నటీనటులు కూడా వారి స్టార్ హోదాను పట్టించుకోకుండా అలాంటి యూనివర్స్ లో నటించేందుకు ఇష్టపడుతున్నారు. అయితే దర్శకుడు సుకుమార్ కూడా అదే తరహాలో ఆలోచిస్తున్నట్లు వార్తలు రాసేస్తున్నారు. రంగస్థలం చిట్టి బాబు పాత్రను పుష్ప 2లో కూడా చూపించే అవకాశం ఉందని కూడా అంటున్నారు.


నిజానికి సుకుమార్ కు అలాంటి ఆలోచన అయితే ఉందట. కానీ కథ ఏమిటి అనే విషయంలో మాత్రం ఇంకా ఏమి అనుకోలేదు. ఒక విధంగా ఈ ప్రాజెక్ట్ లను కలిపితే అనవసర లాజిక్స్ తో కథ డెవలప్ అవ్వడం కష్టం. ఎందుకంటే రంగస్థలంలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ పుష్ప 2లో కూడా ఉన్నాయి. రంగస్థలంలో రామలక్ష్మి పుష్ప లో ఐటెమ్ సాంగ్ ఎలా చేసింది అనే ప్రశ్న పై పెద్దగా డౌట్స్ రాకపోయినా.. అనసూయ పాత్రపై పై మీమ్స్ రాకుండా ఉండవు.

జగపతిబాబు పక్కన చేసిన గుండు క్యారెక్టర్ ఎలా మ్యానేజ్ చేసి ఉంటారు అనే మీమ్స్ కూడా వస్తాయి. అయినా రెండు సినిమాల బ్యాక్ డ్రాప్ టైమింగ్స్ ను మ్యానేజ్ ను బట్టి జత చేయవచ్చు. కేవలం రామ్ చరణ్ క్యారెక్టర్ అంటే పెద్దగా ఇబ్బంది రాదు. కానీ మిగతా క్యారెక్టర్లు వర్కౌట్ కాకుంటే.. మళ్ళీ అదే పాత్రలను రిపిట్ చేసినా.. సుక్కు మల్టివర్స్ ప్లాన్ కు ఛాన్స్ ఉండదు.

Post a Comment

Previous Post Next Post