ధమాకా మూవీ - రివ్యూ & రేటింగ్


కథ:
ఆనంద్ చక్రవర్తి (రవితేజ) ఒక కంపెనీకి అధిపతులు అయిన సంపన్న తల్లిదండ్రుల కుమారుడు. స్వామి (రవితేజ) మధ్యతరగతి ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. అయితే  ఒక కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ చక్రవర్తి కంపెనీని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు అసలు కథనం స్టార్ట్ అవుతుంది. ఇక ఆ తరువాత చక్రవర్తి, స్వామి ఎలా కలుసుకున్నారు? వారిద్దరూ కంపెనీ కోసం ఎలాంటి పని చేశారు? అసలు ఆనంద్, స్వామి కి ఉన్న సంబంధం ఏమిటి అనే అంశాలతో సినిమా కథనం కొనసాగుతుంది.  

విశ్లేషణ:
ధమాకా సినిమాలో రవితేజ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించాడు. అయితే అతను కనిపించిన విధానం మాత్రం ఇంతకుముందు చాలా సినిమాలలో చూసినట్లే అనిపిస్తుంది. అందులో అంత కొత్తగా ఏమీ ఉండదు. అక్కడక్కడ స్వామి క్యారెక్టర్ తో మాత్రం రవితేజ కొంత ఫన్ అయితే క్రియేట్ చేశాడు. ముఖ్యంగా ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు చాలా బాగున్నాయి. కానీ కథనం ముందుకు కొనసాగుతున్న కొద్ది కొన్ని సీరియస్ డ్రామా సన్నివేశాలు మాత్రం రొటీన్ గానే కొనసాగుతూ ఉంటాయి. దర్శకుడు త్రినాధరావు తన అసలైన ఎంటర్టైన్మెంట్ పాయింట్ ను కరెక్టుగానే ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. 

కానీ కథనంలో మాత్రం పెద్దగా బలం లేకపోవడంతో మధ్య మధ్యలో బోరింగ్ గా అనిపిస్తుంది. ఇక ఈ సినిమా కథ ను అలాగే డైలాగ్స్ అందించిన ప్రసన్నకుమార్ మ్యాజిక్ ఈసారి పెద్దగా వర్కౌట్ కాలేదు. అసలు కథ మాత్రం అంత కొత్తగా ఏమీ ఉండదు. ఇక రెండు డబుల్ యాక్షన్ సినిమాలలో ఉండే రెగ్యులర్ పాయింట్ తరహాలో కాకుండా ఇద్దరు హీరోలను కలిపిన విధానం మాత్రం కాస్త కొత్తగానే ఉంది.

ఎంటర్టైన్మెంట్స్ సన్నివేశాలతో సినిమాను డీల్ చేయాలనుకున్న ప్రయత్నం ఈసారి ఫెయిల్ అయ్యింది. సెకండ్ హాఫ్ పై మాత్రం ఇంకాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేదే. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా హీరోయిన్ శ్రీలీల క్యారెక్టర్ గురించి చెప్పుకోవాలి. ఆమె హీరోయిన్గా కొన్ని సన్నివేశాల్లో రొటీన్ ఫార్మాట్లోనే కనిపించింది కానీ డాన్స్ అలాగే కొన్ని లవ్ ట్రాక్స్ లో మాత్రం మంచి పర్ఫామెన్స్ ఇచ్చింది. ఇక భీమ్స్ ఇచ్చిన సంగీతం ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని యాక్షన్ సన్నివేశాలకు మరింత బలాన్ని ఇచ్చింది. 

ఇక పాటలకు తగ్గట్టుగా శ్రీలీల మాస్ మహారాజ్ రవితేజ డాన్స్ చేసిన విధానం.. ఆ పాటల్లోని కొరియోగ్రఫీ కూడా చక్కగా వర్క్ అవుట్ అయింది. అయితే సినిమాలో చాలా వరకు కార్పొరేట్ బ్యాక్‌డ్రాప్, గందరగోళంగా ఉండే కామెడీ, ఫ్యామిలీ డ్రామా మొదలైన రొటీన్ ఫార్మాట్ అంత కిక్కేమి ఇవ్వదు. ముఖ్యంగా రవితేజ అయితే గతంలో చేసినట్లుగానే మళ్లీ ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తున్నాడు. అతని బాడీ లాంగ్వేజ్ డైలాగ్స్ ఎప్పటిలానే ఉన్నాయి. క్లయిమ్యాక్స్ కూడా రొటీన్ ఫార్మాట్ లోనే ఉంటుంది. ఫైనల్ గా సినిమాపై పెద్దగా అంచనాలు లేకుండా వెళితే మాస్ రాజా ఫ్యాన్స్ కు నచ్చే అవకాశం ఉంటుంది.

ప్లస్ పాయింట్స్:
👉మ్యూజిక్
👉స్వామి క్యారెక్టర్ 

మైనస్ పాయింట్స్:
👉రోటీన్ స్టోరీ
👉సెకండ్ హాఫ్
👉రవితేజ రొటీన్ స్టైల్

రేటింగ్: 2.25/5

2 Comments

Post a Comment

Previous Post Next Post