అవతార్ 2 రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

కథ:

అవతార్ 1 కథ నుంచి కొనసాగింపుగా అవతార్ 2 ది వె ఆఫ్ వాటర్ లో క్యారెక్టర్స్ మళ్ళీ కంటిన్యూ అవుతాయి. హీరో జెక్ సల్లి (సామ్ వర్తింగ్టన్)కు పిల్లలు పుట్టగా వారితో అందమైన జీవన విధానం కొనసాగాలని అనుకుంటాడు. అయితే విలన్ మళ్ళీ తిరిగి వస్తాడు. హీరోతో పాటు పాండోరా గ్రహానికి చెందిన తన తెగ ప్రజలను అందరినీ చంపేయాలని అనుకుంటాడు. ఇక జెక్ తన గ్రహం ప్రజలను కాపాడుకునేందుకు మరో ప్రదేశానికి వెళతాడు హీరో. ఇక వారిని కనుగొనేందుకు విలన్ ఏం చేశాడు. విలన్ వచ్చిన తరువాత హీరో తన ఫ్యామిలీని ప్రజలను ఒక రాజులా ఎలా కాపాడుకున్నాడు అనేది వెండితెరపై చూడాలి.


విశ్లేషణ:

పాండోరా గ్రహంలో దర్శకుడు జేమ్స్ కెమెరూన్ మొదటి పార్ట్ లోనే ఊహించని అన్న అద్భుతమైన విజువల్స్ ను ప్రజెంట్ చేశాడు. అయితే ఇప్పుడు అంతకుమించి అనే టెక్నాలజీతో మరింత కనుల విందుగా ఉండే విధంగా గ్రాఫిక్స్ అందించే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో కథపరంగా అయితే రెగ్యులర్ ఫార్మాట్లో ఉన్నప్పటికీ మిగతా మేకింగ్ విధానంలో మాత్రం దర్శకుడు చాలా ప్రయోగాలు చేసినట్లు అనిపించింది. స్క్రీన్ ప్లే విధానమైతే చాలా స్లోగా కొనసాగుతున్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ లో అయితే కొన్ని బోరింగ్ సన్నివేశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కానీ అక్కడక్కడ వచ్చే విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం త్రీడిలో అబ్బురపరిచే విధంగా ఉంటాయి.
ఆడియన్స్ వాటి కోసమైనా సినిమాను చూడాలి.

కథ గురించి ఇక్కడ పెద్దగా మాట్లాడుకునే ప్లస్ పాయింట్స్ లేవు అలాగే మైనస్ పాయింట్స్ కూడా లేవు. ఒక విధంగా దర్శకుడు తను చెప్పాలనుకున్న కథను హై లెవెల్ లో ఏమీ కూడా క్రియేట్ చేయలేదు. సింపుల్ గా సాగిపోతున్న కథలో ఒక రివేంజ్ అలాగే తన ప్రజలను కాపాడుకోవాలని ఒక వ్యక్తితో చేసే పోరాటం అంశాలను హైలెట్ చేసే ప్రయత్నం చేశారు. ఎమోషన్స్ అయితే గ్రాఫిక్స్ ముందు తెలిపోతాయి. ఇక సెకండ్ హాఫ్ లో అయితే కొన్ని యాక్షన్స్ సీన్స్ ఊహించని స్థాయిలో ఉన్నాయి.

గ్రాఫిక్స్ విషయంలో అయితే మైనస్ పాయింట్స్ లేవు. దర్శకుడు స్క్రీన్ ప్లే మీద ఇంకాస్త ఎక్కువగా ఫోకస్ చేసి ఉంటే బాగుండేది అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. దాంతోనే మరో ప్రపంచానికి తీసుకెళ్లారు. అవతార్ 1 స్వరకర్త జేమ్స్ హార్నర్ జూన్ 2015లో విమాన ప్రమాదంలో మరణించడానికి ముందు ఈ ఫ్రాంచైజీకి సంగీతాన్ని అందించారు. డిసెంబర్ 2019లో సైమన్ ఫ్రాంగ్లెన్ దాన్ని కంటిన్యూ చేశాడు.

ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కాగా సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా మేజర్ ప్లస్ పాయింట్.  కెమెరా పనితనం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టైటానిక్ సినిమాటోగ్రఫర్ రస్సెల్ పాల్ కార్పెంటర్ ఈ సినిమాకు వర్క్ చేశాడు. ముఖ్యంగా సముద్ర జలాలలో సంబంధించిన సన్నివేశాలు మాత్రం ఆడియన్స్ ను అబ్బుర పరిచేలా కెమెరా యాంగిల్స్ సెట్ చేయడం హైలెట్. అలాగే పక్షులతో అవతార్ క్యారెక్టర్స్ స్వైర విహారం చేసే కొన్ని సీన్స్ కూడా సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి.
ఏదేమైనా కూడా ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కొన్ని ఉన్నప్పటికీ కూడా మిగతా కొన్ని సన్నివేశాలు మాత్రం వాటిని మాయం చేసేలా ఉన్నాయి. అనవసరంగా మైనస్ పాయింట్స్ గురించి ఆలోచించకుండా 3 గంటల పాటు త్రీడీ అనుభూతి కోసం ఈ సినిమాను చూస్తే మాత్రం మంచి ఫీలింగ్ కలుగుతుంది. అలాగే ఇలాంటి సినిమాలకు రేటింగ్ కూడా ఇచ్చి దాని స్థాయిని కొలిచే అర్హత కూడా ఎవరికి లేదు. అందుకే రేటింగ్ ఇవ్వకుండా మా అనుభూతిని చెబుతున్నాము.

Post a Comment

Previous Post Next Post